పట్టభద్రుల ఓటు నమోదుపై బీఆర్ఎస్ ముమ్మర కార్యాచరణ

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. పట్టభద్రులంతా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఉమ్మడి చందానగర్ డివిజన్ పరిధిలో నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంపై జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డితోపాటు డివిజన్ ముఖ్య నాయకులతో వారు సమావేశమై ఓటరు నమోదు ప్రక్రియపై చర్చించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఓటరు నమోదు గడువుకు సమయం తక్కువగా ఉన్నందున పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి డివిజన్‌లో 3 వేల నుంచి 4 వేల వరకు పట్టభద్రుల ఓట్లు నమోదు చేయించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు. పట్టభద్రుల ఓటర్లను గుర్తించి నమోదు ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి చందానగర్ డివిజన్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here