నమస్తే శేరిలింగంపల్లి: నేడు వాటర్ వర్క్స్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన సంవత్సర గోడ క్యాలెండర్ ను డివిజన్ 15 జనరల్ మేనేజర్ రాజశేఖర్, ఒప్పంద ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జనరల్ మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ తమ సంస్థ లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు ఈ సంవత్సర కానుకగా G.O 14 ద్వారా జీతాలు పెరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఒప్పంద ఉద్యోగులకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. యూనియన్ అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ ఒప్పంద ఉద్యోగులు చాలా క్రమశిక్షణతో పనిచేస్తున్నారని, జీతాలు పెరుగుదల కోసం ప్రభుత్వం పై ఆశతో ఎదురుచూస్తున్నట్లు ప్రభుత్వం దృష్టిలో ఉందని, ఎవ్వరూ జీతాల విషయం లో ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రటరీ కిరణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజరత్నం, చందనగర్ డివిజన్ నాయకులు శ్రీనివాసరెడ్డి, ఉమేష్ వర్మ, మల్లేశ్ గౌడ్, మీటర్ రీడర్లు, సీవరేజ్ కార్మికులు, వాటర్ లైసెమెన్స్, పర్మినెంట్ ఉద్యోగుల నాయకుడు మక్తా రమేశ్ పాల్గొన్నారు.
