నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో నిర్వహిస్తున్న నేషనల్ హ్యాండీ క్రాఫ్ ఫెయిర్ సందర్బంగా పాండిచేరి నుండి వచ్చిన సేన్టేడ్ కండ్లెస్, అస్సాం నుండి వచ్చిన బాంబుతో తయారు చేసిన బుట్టలు, హర్యానా చెప్పులు, గుజరాత్ బందీని వర్క్, కోలకతా కాంత వర్క్, బీహార్ మధుబని పెయింటింగ్స్ కాశ్మీరీ శాలువాలు మొదలైనవి హస్తకళా ఉత్పత్తులు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి.
సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కుమారి అనాహిత చలియా అస్సాం నుండి విచ్చేసిన భరతనాట్య కళాకారిణి, మంజుల వసిష్ఠ బృందం చెయ్ కూచిపూడి నృత్య ప్రదర్శన, హర్యానా రాష్ట్ర జానపద నృత్యాలు ఎంతగానో అలరించాయి.