నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని బికె ఎన్ క్లేవ్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సి సి రోడ్డు పనులను స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ బికె ఎన్ క్లేవ్ కాలనీలో సిసి రోడ్డు పనులను పరిశీలించామని, అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజి పడకూడదని అధికారులకు ఆదేశించారు. డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి, కృష్ణ గౌడ్, సదనంద్, లక్ష్మణ్, శివ ముదిరాజ్, వెంకటేష్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
