ఓఎస్డి వెంకట కృష్ణ , ఈఈ శ్రీకాంతినిని వెంటనే బదిలీ చేయాలి 

  • ఎమ్మెల్యేకు, బిఆర్ ఎస్ పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నారని మండిపాటు

నమస్తే శేరిలింగంపల్లి: వారిద్దరూ బిఆర్ఎస్ పార్టీకి, ఆపద్ధర్మ ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, వెంటనే వారిద్దరినీ బదిలీ చేయాలని కోరుతున్నారు మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి. శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఓఎస్డి వెంకట కృష్ణ ప్రభుత్య అధికారిగా కాకుండా రాజకీయ నాయకుడిగా ప్రవర్తిస్తూ ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించే వారిని పోలీస్ స్టేషన్లో , జైలులో వేయిస్తానని బెదిరిస్తున్నాడని, ఎమ్మెల్యేకు, బిఆర్ ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్నాడన్నారు.

గత 9 సంవత్సరాలుగా ఎలాంటి బదిలీ లేకుండా ఒకే స్థానంలో, ఒకరి దగ్గరే పనిస్తున్నారని చెప్పారు. ఇక జీహెచ్ ఎంసి సర్కిల్ 21 ఈఈ శ్రీకాంతి ఎమ్మెల్యేకు స్వయానా అతి సమీప బంధువు కావటం వల్ల ఆమె వారికి అనుకూలంగా పనులు చేస్తూ తమ కార్యాలయ సిబ్బందిని కూడా ఎమ్మెల్యేకు, బిఆర్ ఎస్ పార్టీ కి అనుకూలంగా పని చేయిస్తున్నదని తెలిపారు. వీరిద్దరి వల్ల ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వారిని తక్షణమే బదిలీ చేయాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here