- అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ లను అమలు చేస్తాం: జెరిపాటి జైపాల్
నమస్తే శేరిలింగంపల్లి: గడపగడపకు జైపాల్ అన్న కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా 5వ రోజు హఫీజ్ పెట్ డివిజన్ లోని ఆర్టీసీ కాలనీ వివేకానంద స్వామి విగ్రహం నుండి హుడా ట్రేడ్ సెంటర్ వరకు ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రాలను పంచుతూ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి జెరిపేటి జైపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గెలిచేది కాంగ్రెస్ పార్టీ నేనని, ఎవరో ఎన్నో కల్లబొల్లి మాటలు చెబితే పట్టించుకోవద్దని, ఇన్ని రోజులు మనం మోసపోయిన వరకు చాలు అని, ఇకనైనా మనమందరం కలిసికట్టుగా నిలబడి శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగిరే వరకు పోరాడాలని అన్నారు.
గడిచిన పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వెలగబెట్టిన అభివృద్ధి గుండు సున్నగా ఉందని, సీఎం కేసీఆర్ ఎన్నో మాయ మాటలు చెప్పే మాయల మాంత్రికుడు అని, ఆయన మాటలు నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరోసారి మోసపోకూడదని అన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి రావడానికి ఎన్నో చెప్పారని ఎక్కడ రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, దళితులకు మూడు ఎకరాల భూమి, ఫ్రీజు రీయింబర్స్ మెంట్, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య, పోడు భూములకు పట్టాలు, 12% ముస్లిం గిరిజన రిజర్వేషన్లు, ఇంటికో ఉద్యోగం ఎక్కడని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలలో ప్రజలకు ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని, కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాట ఇస్తే నిలబెట్టుకునే దమ్ము ఉన్న పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రేణుక, రాజేష్ గౌడ్, రాజేందర్, మహమ్మద్ జాంగిర్, రాజన్, కవిరాజ్ , మొహమ్మద్ అజీముద్దీన్, సాయి కిషోర్, శివ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.