- అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తున్న ఓ పబ్ యాజమాన్యం
నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ హైటెక్ సిటి లోని మాష్ పబ్ యాజమాన్యం ఆన్ లైన్ డేటింగ్ యాప్ ల ద్వారా అమ్మాయిలకు ఎర వేస్తున్న వైనం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు మాష్ పబ్ యాజమాన్యం ఆన్ లైన్ డేటింగ్ యాప్ ల ద్వారా అమ్మాయిలకు ఎర వేస్తూ.. అలా తమ వద్దకు వచ్చిన కస్టమర్ లకు విలువైన మద్యము తాగించి, వారి నుండి ఎక్కువ మొత్తంలో డబ్బులను బిల్లుల రూపంలో వసూలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో మాదాపూర్ పీఎస్ లో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేపడుతున్నారు.