నమస్తే శేరిలింగంపల్లి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి డప్పు కొట్టు హరిబాబు యాదవ్ తన జన్మదినం సందర్భంగా జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్యని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాక జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్, గోకుల్ కృష్ణ ఫౌండేషన్ అప్డేట్ వ్యవస్థాపకులు హరిబాబు యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ అత్యున్నత శిఖరాలని అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవితాన్ని గడపాలని, మానవ సేవయే మాధవసేవగా పరమావధిగా పరిగణించాలన్నారు. ఈ వేడుకల్లో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, డైరెక్టర్ పెద్దరాజు మధు, రాజేష్, పవన్, కృష్ణ, రాము పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.