నమస్తే శేరిలింగంపల్లి : పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారధ్యంలో జరుగుతున్న అన్నమయ్య కీర్తనలు అలరింపజేస్తున్నాయి.
ఇందులో భాగంగా అన్నమ స్వరార్చన కార్యక్రమం లో శోభా రాజు ఆధ్వర్యంలో “సంస్కృతి ఆర్ట్ అకాడమీ” గురువు తరిగొప్పుల శ్వేత శిష్యులు ( ధృతి, సాన్వీ, మొక్ష, చకృతి, కీర్తన, సహస్ర, జాహ్నవి, హయతి, వైష్ణవి, ఆక్షయాణి, రిషిగా, మనస్విని, అశ్విని, నక్షత్ర, భవిష్యా, నయిని, హాసిని, సాయి సమన్విత, సమీరా, అన్విత) 20 మందితో శిరుత నువ్వుల వాడు, ఇందరికి అభయంభూ, బ్రహ్మ మొక్కేటే, అని మంత్రములు మొదలగు అన్నమయ్య కీర్తనలకు కూచిపూడి నృత్యం చేపట్టి శ్రోతలను ఆకట్టుకున్నారు. తదనంతరం సంస్థ అధ్యక్షులు డా. శోభా రాజు కళాకారులని శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.