నమస్తే శేరిలింగంపల్లి : ఓల్డ్ హఫీజ్ పేట్ వార్డు కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణిని హఫీజ్ పేట డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ సందర్శించారు.
ప్రజా పాలన దరఖాస్తుదారులతో మాట్లాడి వారికి దరఖాస్తు పత్రాలను అందకపోవడంతో జెడ్సీ కి వివరించారు. ఈ సందర్భంగా జెడ్సీ శ్రీనివాస్ రెడ్డి గౌతమ్ గౌడ్ తో మాట్లాడి దరఖాస్తు పత్రాలను ఇప్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డీసీ వంశీకృష్ణారెడ్డి, వార్డు సభ్యుడు కనుక మామిడి వెంకటేష్ గౌడ్, మల్లేష్ గౌడ్, సంజయ్ గౌడ్, సాబీర్, సుధీష్, జేమ్స్ పాల్గొన్నారు.