- శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వాడవాడలా రెపరెపలాడిన కాంగ్రెస్ జెండా
- కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇచ్చార్జి జగదీశ్వర్ గౌడ్
- తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేద్దామని పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో కాంగ్రెస్ జెండా రెపరెపలాండింది. ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, హైదరనగర్, హఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ పరిధిలోని బస్తి, కాలనీ, వాడవాడల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొని కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ.. సోనియమ్మ, పీవీ, మన్మోహన్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు దేశం కోసం నిరంతరం శ్రమించారని, దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షలను తీర్చినా.. అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమయ్యిందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగా అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కోరారు.
రాహుల్ గాంధీ త్వరలో చేపట్టే యాత్రను విజయవంతంగా చేపట్టాలని, ప్రతి కార్యకర్త తమ వంతు సహకారం అందించాలని కోరారు. భారత జాతీయ కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.