న్యాయపోరాటం చేద్దాం.. గెలుపు మార్గాలు అన్వేషిద్దాం

  • తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ , బిసి ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం
  • బీసీలంతా ఏకతాటిపైకి రావాలని పిలుపు

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ , బిసి ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జై బీసీ అధ్యక్షుడు కస్తూరి గోపాలకృష్ణ, మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరగలేదని, రాష్ట్రవ్యాప్తంగా రథయాత్ర చేసి తమ ప్రాంతం నుండి హైదరాబాద్ వరకు న్యాయపోరాటం సాగించాలన్నారు. జిహెచ్ఎంసి, ఎంపీ ఎన్నికల్లో బీసీలు అత్యధికంగా పోటీ చేసి గెలుపు మార్గాలు అన్వేషించాలని కోరారు. బీసీలకు ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీ ఉండాలని అభిలాషించారు.
బీసీల గురించి సమీక్ష సమావేశాలు జరగాలని, గ్రామీణ ప్రాంతం నుండి బీసీలను ఏకం చేయాలని, ఐకమత్యంతో రాజ్యాధికారం సాధించాలని ముఖ్య సలహాదారు డాక్టర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపే ముఖ్యమని బీసీలను ఏకం చేయాలని, రథయాత్ర ద్వారా బీసీల ఐకమత్యం పెంపొందించి అధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేయాలని జిహెచ్ఎంసి బీసీ అధ్యక్షులు రామాచారి కోరారు.

సమీక్ష సమావేశంలో బీసీ ప్రముఖులతో భేరి రాంచందర్ యాదవ్, ఆర్కే సాయన్న

బీసీలను ఏకతాటి పైకి తీసుకొచ్చి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ ప్రతిదానికి బీసీలు పోటీ చేసే విధంగా చూడాలని బీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కనక చారి చెప్పారు. బీసీ హైదరాబాద్ సెక్రెటరీ సెల్వరాజ్ మాట్లాడుతూ ఐకమత్యమే మనబలమని, సమస్యల మీద పోరాటం చేస్తూ జనంలోకి వెళ్లాలని కోరారు. హైదరాబాద్ నుంచి స్టార్ట్ కావాలని చెప్పారు. బీసీ యూత్ అధ్యక్షులు కుమార్ యాదవ్ బీసీలను ఏం చేస్తూ యూత్ మహిళలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉద్యమం ఉధృతం చేద్దామని, ఎన్నికల్లో పాల్గొనడమే ముఖ్య ఉద్దేశంగా ముందుకెళ్దామని తెలిపారు.

బీసీ వికాస్ సమితి అధ్యక్షులు నర్సింగ్ రావు మాట్లాడుతూ జై బీసీ బీసీ ఫెడరేషన్ ఐక్య వేదిక ద్వారా రథయాత్ర సాగించి బీసీల్లో చైతన్యం తీసుకొని రావాలని, గెలుపే ముఖ్యంగా ఐకమత్యంతో పని చేస్తూ ముందుకు వెళ్లాలని కోరారు. ఇలా అశోక్ తో పాటు మరికొందరు తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. విద్యార్థి విభాగం కేంద్రీయ విశ్వవిద్యాలయం పీహెచ్డీ విద్యార్థి శ్రీరామ్ యాదవ్ చర్చలో పాల్గొని మాట్లాడారు. యూనివర్సిటీల్లోని విద్యార్థులను ఏకం చేసి ఉద్యమంలో భాగస్వాములు చేసి న్యాయపోరాటంలో పాల్గొనే విధంగా కృషి చేస్తానని వాగ్దానం చేశారు. 2024 ఆంగ్ల సంవత్సరం సంక్రాంతి పండుగలకు కొత్త క్యాలెండర్ ఆవిష్కరించాలని సభ్యులందరూ తోచిన విధంగా క్యాలెండర్ విరాళాలు ఇవ్వాలని కోరారు. బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ ఎంపీ ఎలక్షన్లు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ ఎలక్షన్స్, ఏ ఎన్నికలనైనా మనం ఎదుర్కొని గెలుపే ముఖ్యంగా ముందుకెళ్దామని అన్ని సంఘాలకు కుల బంధువులకు నాయకులకు కార్యకర్తలకు కోరారు. జిహెచ్ఎంసి అన్ని ప్రాంతాల్లో ఏరియాలో సమావేషాలు ఏర్పాటు చేసుకొని అందర్నీ కలుపుకొని ఐకమత్యంతో ముందుకెళ్దామని తెలిపారు. గల్లీ నుండి గ్రామీణ పట్టణాల్లో కూడా కమిటీలు వేయడం ముఖ్యమని, క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ చేద్దామని పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here