- మద్దతు తెలుపుతూ గెలిపిస్తామంటూ ప్రజల హామీ
నమస్తే శేరిలింగంపల్లి: ఎన్నికల ప్రచారంలో భాగంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేట్ గ్రామం, సాయినగర్, యూత్ కాలనీలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల ప్రాముఖ్యతను కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ ఓటరుకు తెలియజేస్తూ ముందుకు సాగారు. 30వ తేదీన హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరగా.. ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారీఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.