నమస్తే శేరిలింగంపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తెలిపారు.

చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కాలనీలో చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అనుబంధ సంఘాలతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడం జరుగుతుందని, పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. 30వ తేదీన బిఆర్ఎస్ పార్టీకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.