అభిమాన నేత‌కు క‌ళాత్మ‌క అభినందన‌లు

శ్ర‌వణ్‌ కుమార్ గీసిన బాలింగ్ గౌత‌మ్ గౌడ్ చిత్రం

హ‌ఫీజ్‌పేట్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అభిమాన నేత పుట్టిన రోజు సంద‌ర్భంగా ఒక విద్యార్థి త‌న క‌ళాత్మ‌క అభినంద‌న‌లు తెలియ‌జేశాడు. జ‌న‌ప్రియ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉండే జేఎస్‌కే శ్ర‌వ‌ణ్ కుమార్ డిగ్రీ రెండ‌వ సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. ఐతే చిత్ర‌క‌ళ‌పై ఎంతో మ‌క్కువ‌ క‌లిగిన శ్ర‌వ‌ణ్ ఎలాంటి శిక్ష‌ణ తీసుకోకుండానే చిత్రాలు వేయ‌డంపై దృష్టి సారించాడు. ఈ క్ర‌మంలోనే త‌ను అభిమానించే యువ‌నాయ‌కుడు టీఆర్ఎస్ పార్టీ హ‌ఫీజ్‌పేట్ డివిజ‌న్ అధ్య‌క్షుడు బాలింగ్ గౌత‌మ్ గౌడ్‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా అత‌డి చిత్రాన్నిగీశాడు. ఆచిత్రాన్నిబ‌హుమ‌తిగా అంద‌జేసి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఈ సంద‌ర్భంగా గౌత‌మ్ గౌడ్ మాట్లాడుతూ త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఎంతో మంది ఎన్నో బ‌హుమ‌తులు అంద‌జేశార‌ని, ఐతే త‌మ్ముడు శ్ర‌వ‌ణ్ స్వంతంగా గీసిన త‌న చిత్రాన్ని బ‌హుమ‌తిగా అందుకోవ‌డం ఎంతో సంతృప్తిని క‌లిగించింద‌ని అన్నారు. శ్రవ‌ణ్‌లాంటి క‌ళాకారుల‌కు త‌న‌వంతు ప్రోత్సాహం ఎల్ల‌ప్పుడు ఉంటుంద‌న్నారు.

త‌ను గీసిన చిత్రాన్ని బాలింగ్ గౌడ్‌కు బ‌హుమ‌తిగా అందజేస్తూ శుభాకాంక్ష‌లు తెలుపుతున్న శ్ర‌వ‌ణ్‌కుమార్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here