మియాపూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జాలపై సీపీఎం ఆందోళన

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడటంతో పాటు అక్రమ నిర్మాణాలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ సర్వే నంబర్ 69/1లో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నట్లు సీపీఎం నాయకులు ఆరోపించారు. భూముల రికార్డులు, సర్వే వివరాల్లో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, సర్వే నంబర్లను మార్చి నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. పాత సర్వే రికార్డుల్లో 224 వేసి 69/1లో నిర్మాణాలు జరుగుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సీఎంసీ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని కోరారు. ఆక్రమణలను గుర్తించి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని, అక్రమ నిర్మాణాలను తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీపీఎం శేరిలింగంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సి.శోభ‌న్‌, వి.మాణిక్యం, కె.కృష్ణ‌, ఎస్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here