ఘనంగా నటసార్వభౌమ, నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి

  • నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : తెలుగుజాతి కీర్తి మకుటం, తెలుగునేల ముద్దుబిడ్డ, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని 100 ఫీట్ రోడ్ లో పద్మ శ్రీ, స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

నటసార్వభౌమ, పద్మ శ్రీ, స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించి జోహార్లు తెలుపుతున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర చిరస్థాయిగా వేసుకున్న నాయకుడు, సూర్య చంద్రులు ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన మాహానుభావుడు, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు అని అన్నారు.

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని 100 ఫీట్ రోడ్ లో స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహం వద్ద..

విశ్వ విఖ్యాత నట సార్వాభౌమునిగా యావత్ ప్రపంచానికి ఆయన ఒక కళాప్రవీనుడిగా… కుల, మత బేధం లేకుండా అందరి అభివృద్ధి కోసం కృషి చేసిన సాక్షాత్ భగవత్ స్వరూపుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీ.శే. నందమూరి తారకా రామారావు అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here