నమస్తే శేరిలింగంపల్లి : మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 101వ జయంతిని మియాపూర్ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ నగర్ కాలనీలోని స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి స్థానికులతో కలిసి మియాపూర్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉప్పలపాటి శ్రీకాంత్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర చిరస్థాయిగా వేసుకున్న నాయకుడు, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు అని అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని జేపీ నగర్ కాలనీలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.
బడుగు, బలహీన వర్గాలకు, యువతకు రాజకీయ అవకాశాలు కల్పించి కొత్త అధ్యాయం సృష్టించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు, శ్రేయోబిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.