నమస్తే శేరిలింగంపల్లి : వచ్చేది వర్షాకాలం.. లోతుగా సెల్లారు గుంతలు తీయడం అనేక ప్రమాదాలకు కారణమవుతుందని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి తెలిపారు. చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్ డివిజన్ లోని అయ్యప్ప సొసైటీలో అసలే అక్రమ కట్టడాలు.. ఆపై అనుమతులు లేకుండా సెలార్ గుంతలు తీయడం ఎంతవరకు సమంజస మన్నారు. ప్లాట్ నెం 3-400 లో పక్కనే పాత పురాతన భవనాలు రెండు ఉన్నాయని లోతైన గుంత తవ్వటం పలు ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టవుందన్నారు.
ఇప్పటికే కేరళలో ఋతుపవనాలు వస్తున్నాయని ప్రచార మాధ్యమాల ద్వారా తెలుస్తున్నదని, కానీ జిహెచ్ఎంసి అధికారులు మాత్రం సెల్లార్ గుంతలను నిలిపివేయడంలో విఫలమవుతున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ సెల్లార్ గుంతలను నిలిపివేయడంలో అలసత్వం వహిస్తే వచ్చే వర్షాకాలంలో పక్కనే ఉన్న భవనాలు కూలితే ఆ మూల్యాన్ని ప్రభుత్వమే భరించాల్సి వస్తుందన్నారు. వెంటనే జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు పరిశీలించి అయ్యప్ప సొసైటీలోని ప్లాట్ నెంబర్ 400 లో చేపడుతున్న సెల్లార్ గుంతను నిలిపివేసి అక్కడ పనిచేస్తున్న యంత్రాలను సీజ్ చేయాల్సిందిగా ప్రజల కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.