నమస్తే శేరిలింగంపల్లి : మానసిక ఒత్తిడి లోనై ఐటీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు టీఎన్జీఓస్ కాలనీ లోని రాక్ నెస్ట్ బిల్డింగ్ లో నీతు పలివాల్ (42) నివాసం ఉంటున్నది. ఆమె విప్రో కంపెనీలో ఐటీ ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నది. డిప్రెషన్ కారణంగా ఆమె మూడేండ్లుగా చికిత్స పొందుతున్నది.
అయితే 27వ తేదీన రాత్రి 9.30 గంటల సమయంలో తన సోదరుడు సౌరభ్ పలివాల్ (40) ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. వెంటనే తన ఇంటికి వెళ్లి తలుపు కొట్టగా తీయకపోవడంతో.. ఆ ఇంటి యజమానుల సహాయంతో తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా తన సోదరి సీలింగ్ ఫ్యాన్ ఉరి వేసుకుని కనిపించింది. ఈ విషయంపై సౌరబ్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.