- శేరిలింగంపల్లి బీజేపీ నేతల అరెస్టును ఖoడిస్తున్నాo
- గుడిసెవాసులకు వెంటనే పక్కా ఇల్లు ఇచ్చి ఆదుకోవాలి
- బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ మసీదు బండ లో గుడిసెల తొలగింపును
శేరిలింగంపల్లి బిజెపి తీవ్రంగా కండిస్తుందని బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. పోలీసుల అండతో GHMC అధికారులు గుడిసెలను కూల్చివేసి 15 ఏండ్లుగా అక్కడ ఉంటున్న నిరుపేదలకు నిలువ నీడ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల అండదండలతో పార్కులు, ప్రభుత్య భూములు చెరువులు, కుంటలు, శ్మశానవాటికలతో సహా వందల కోట్ల రూపాయల విలువ గల భూములను ఆక్రమించి అమ్ముకుంటున్నా వారి జోలికి పోకుండా .. 30 -40 గజాల్లో గుడిసెలు వేసుకున్న పేదలపై ప్రతాపం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వారికి ఆధారం చూపించాలని, డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
