నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా చందర్ రావు, రంగారెడ్డి అర్బన్ జిల్లా మైనారిటీ మోర్చా ఉపాధ్యక్షుడిగా ఎం.డి గౌస్ నియమితులయ్యారు. ఈ సందర్బంగా వారికి బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని, రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద పదవులు అలంకరించాలని తెలిపారు. బిజెపి అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజల వద్దకు చేర్చేలా చూడాలని పేర్కొన్నారు.