సకల సౌకర్యాలతో సుందర శోభిత వనాలుగా తీర్చిదిద్దుతాం : ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ చౌరస్తా, FCI కాలనీ, ప్రగతి ఎన్ క్లేవ్, నీలిమ గ్రీన్స్, దీప్తి శ్రీ నగర్, మక్త మహబూబ్ పెట్, బీకే ఎన్ క్లేవ్, మయూరి నగర్ కాలనీలలో రూ.6 కోట్ల 05 లక్షల అంచనావ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్లు, మియాపూర్ జంక్షన్ అభివృద్ధి నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివృద్ధి ఆగకూడదనే ఉద్దేశ్యంతో సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, అన్ని రకాల మౌలిక వసతులతో, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో సుందర శోభిత వనాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

మియాపూర్ డివిజన్ పరిధిలోని వరదనీటి, రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
  • శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు ..

మియాపూర్ బొల్లారం x రోడ్డు లో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ పనులు, ఎఫ్ సిఐ కాలనీ సెయింట్ రిట్ స్కూల్ సమీపంలో రూ.55 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు పనులు, ప్రగతి ఎన్ క్లేవ్ కాలనీలో రూ.38 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం, దీప్తిశ్రీనగర్ కాలనీలో రూ. 25 లక్షలు, మక్తా మహబూబ్ విలేజ్ లో రూ.50 లక్షలు, బీకే ఎన్ క్లేవ్ కాలనీలో రూ.32 లక్షలు, మాయూరి నగర్ కాలనీలో రూ. 25 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు, నీలిమ గ్రీన్స్ కాలనీలో రూ.1.75 లక్షల అంచనా వ్యయంతో వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశామని ప్రభుత్వ విప్ గాంధీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు , కాలనీ వాసులు పాల్గొన్నారు.

మియాపూర్ డివిజన్ లో సీసీ రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here