
నమస్తే శేరిలింగంపల్లి: మూడు రోజుల కిందట శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ ప్రాంతంలోని స్టాలిన్ నగర్ లో వడ్డెర సంగం కులస్తుల గుడిసెలను కూల్చిన విషయం విదితమే. ఈ విషయంపై అఖిలభారత వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి మారయ్య, శేరిలింగంపల్లి అధ్యక్షుడు ముద్దంగుల తిరుపతి స్పందించి వారిని పరామర్శించారు. గుడిసెవాసులకు నిత్యావసర సరుకులు అందించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. అతి త్వరలో స్థానిక ఎమ్మెల్యే , కార్పొరేటర్ల, అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, న్యాయం చేకూరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక వడ్డెర సంఘం నాయకులు పూజారి గురువయ్య, గిరయ్య, మల్లేష్, రామకృష్ణ, గురువయ్య, హనుమంతు పాల్గొన్నారు.
