సంక్షేమం అంటే పేద కుటుంబాలలో కనిపించే ఆనందం: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

  • ప్రభుత్వ స్థలాల్లో నివస్తిస్తున్న నిరుపేదలకు ఆస్తి హక్కులు
  • ధ్రువీకరణ పత్రాలు అందజేత

నమస్తే శేరిలింగంపల్లి: దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న నిరుపేదలకు జీవో 58 ద్వారా ఆస్తి హక్కులను కల్పిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డినగర్ లో దరఖాస్తు చేసుకున్న వారికి జీవో 58 ద్వారా యజమాని హక్కుల ను కలిపిస్తూ అర్హులైన లబ్ధిదారులకు కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నిరుపేదలకు అండగా ఉండేది ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న నిరుపేదలకు జీవో నెంబర్ 58 ప్రకారం వారికి రెగ్యులరైజ్ చేసి జీవితంపై భరోసా కల్పించిన గొప్ప మహానుభావుడు అని కొనియాడారు. అదేవిధంగా 59 జి.ఓ కింద ప్రభుత్వం నిర్ణయించిన డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రభుత్వం కల్పించిన 5 శాతం రాయితీని సైతం పొందారని చెప్పారు. సంక్షేమం అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాల సంఖ్య కాదు.. పేద కుటుంబాలలో కనిపించే ఆనందం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు చిట్టి రెడ్డి శ్రీధర్ రెడ్డి , గడ్డం రాజేశ్వర రెడ్డి, భగవంతు రెడ్డి, ఈరెడ్డి దేవేందర్ రెడ్డి, నర్సింలు,దొడ్ల రామ్ రెడ్డి, రామకృష్ణారెడ్డి , బాల నర్సయ్య, సంపత్ రెడ్డి, అబ్బులు, సాయి రెడ్డి, బాగిరెడ్డి, ధర్మారావు, మహేందర్ రెడ్డి, కనకయ్య, వెంకట్ రెడ్డి,బాల్ రెడ్డి, వెంకటేష్ , ఎల్లారెడ్డి, కన్న రావు, శంకర్ రెడ్డి, సంజీవ రెడ్డి, అష్రాఫ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here