సీఎం సహాయ నిధి అందజేత

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని రాజా రామ్ కాలనీకి చెందిన కుబ్రా బీ ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా సీఎం ఆర్ ఎఫ్ నుంచి
రూ. 1లక్షా 50 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును బాధిత కుటుంబాలకి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని ఈ సందర్బంగా తెలిపారు. వైద్య చికిత్స కోసం సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి బాధితురాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

బాధితుడికి సీఎం ఆర్ ఎఫ్ చెక్కును అందిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here