నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా భరతనాట్యం , కథక్ నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. కాలిఫోర్నియా , యూఎస్ఏ నుండి విచ్చేసిన తరణి కోవెల్లంపూడి తన ప్రదర్శనలతో ఆకట్టుకున్నది.
శ్రీ విజ్ఞారాజం భజే, ఎందరో మహానుభావులు, కళింగ నర్తనం అంశాలను చక్కని అభినయం తో ప్రదర్శించి మెప్పించింది. తరంగిణి కథక్ అకాడమీ సుబ్రత్ సర్కార్ శిష్యబృందం కథక్ నృత్య అంశంలో గణేశా వందన, కృష్ణ వందన, తీన్ తాల్ , సరస్వతి వందన, తుమ్రి, తరాన అంశాలను తనిష్క, అన్య, శీలాసింగ్, భావన, నేహా, శ్రియ, ఆరాధ్య, ఆంచల్ మొదలైనవారు ప్రదర్శించి మెప్పించారు.