శిల్పారామంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు

  • ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు

నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో బతుకమ్మ దసరా ఉత్సవాలు ఆకట్టుకుంటున్నాయి. చేనేత చీరలను కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. కోట, కోర, జాంధానీ, బెంగళూరు సిల్క్, మదనపల్లి, చెందేరి సిల్క్, కాటన్, కాశ్మీరీ సిల్క్, చీరలు, డ్రెస్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. మహిళా సిబ్బంది, సందర్శకులు ఆడుతున్న బతుకమ్మ, దాండియా ఆటలతో సందడి నెలకొన్నది. మంగళవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా లక్ష్మి శంకర్ శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. గణేశా పంచరత్న, పార్వతి నందనం, గీత రాసికీ, రాముడు రాఘవుడు, కామాక్షి స్తుతి, యోగ  యోగేశ్వరి, జతిస్వరం, భ్రమరాంబ అష్టకం, మంగళం అంశాలను ఆశ్రిత , గాయత్రీ, లాస్య, రితిక, సాహితి, శ్రీవాణి, శ్రీనీతి ప్రదర్శించారు.

లక్ష్మి శంకర్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన
బతుకమ్మను ఒకచోట చేర్చి పాటలతో సందడి చేస్తున్న మహిళలు, సందర్శకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here