- చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ నేతాజీనగర్ కాలనీలోని అంగన్ వాడి సెంటర్ లో పల్స్ పోలీయో కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ భారతదేశం పోలియో రహిత దేశమని అన్నారు. పిల్లలకు కచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని, పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అవి దోహదపడతాయని పేర్కొన్నారు. అంగన్ వాడీ టీచర్ మనీలా, ప్రభుత్వ ఆసుపత్రి ఆశా వర్కర్లు పాల్గొన్నారు.