నమస్తే శేరిలింగంపల్లి : హైదర్ నగర్, ఆల్విన్ కాలనీల్లో శ్రీరామ నవమి కళ్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూన సత్యం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మధు, గాయత్రితో కలిసి అవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు, కాంగ్రెస్ మహిళా నాయకురాలు శిరీష సత్తూర్ రామాలయాల్ని దర్శించుకున్నారు.
శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అనంతరం అన్న ప్రసాదాలు వడ్డించి, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.