నమస్తే శేరిలింగంపల్లి: పార్లమెంట్ ఎన్నికల ముగిసిన తదనంతరం మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంతో అత్యంత కీలకమైన ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకున్న నియోజకవర్గ ఓటర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు బీఆర్‌ఎస్ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన స్వల్ప కాలంలోనే పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పటికీ తనకు అఖండ మెజార్టీ అందించటమే కాకుండా.. బీఆర్‌ఎస్ చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకోసం నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు తామే అభ్యర్థిలా భావించి అలుపెరగకుండా శ్రమించారని అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిన్న మధుసూదన్ రెడ్డి, మామిడల రాజయ్య, ఖాసీం, లియకత్, బాబు మియా, సలీం రాజయ్య, మియన్ పటేల్, బాబు మియా, కాజా, అజిముల్లా ఖాన్, షేక్ ఇమ్రాన్, మహమ్మద్, అరవింద్ ఠాకూర్, షేక్ సలీమ్, నవాబ్, స్నేహ, రహ్మత్ సేన్ పాల్గొన్నారు.