నమస్తే శేరిలింగంపల్లి : స్థానిక నల్లగండ్ల శ్రీ చైతన్య పాఠశాల సి.బి.ఎస్.ఇ 10వ తరగతి ఫలితాల్లో విజయకేతనం ఎగురవేసింది. శ్రీ చైతన్య పాఠశాల ఉత్తీర్ణత సాధించి (491/500) వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకుంది. కె.అవని ఉపాసన 491/500(98.2 మార్కులు సాధించి ముందంజలో ఉంది.

పాఠశాలలో విద్యార్థులు అందరూ 75% పైన మార్కులు సాధించారని, 100% ఉత్తీర్ణులయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ యు. వాణి తెలిపారు. ఇంతటి ఘన విజయం సాదించడానికి విద్యార్థుల నిరంతర కృషి వారి తల్లిదండ్రుల సహకారము, ఉపాధ్యాయుల సృజనాత్మక బోధన, పర్యవేక్షణ, వ్యక్తిగత శ్రద్ధ, శ్రీ చైతన్య పాఠశాలల యాజమాన్యం సూచనలు, సలహాలు, నడిపించే విధానము ముఖ్య కారణమని ఆమె కొనియాడారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఏ. జీ.యం. శివరామకృష్ణ, ఆర్.ఐ. అనితా మేడమ్, ప్రిన్సిపల్ యు. వాణి, ఉన్ నాగరాజు, టెన్త్ క్లాస్ ఇన్చార్డ్ ఎం.కె. రంగ విజయం సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తమ శుభాకాంక్షలు తెలిపారు.