- ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ నర్సుల దినోత్సవం
నమస్తే శేరిలింగంపల్లి : అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఫ్లోరెన్స్ నైటింగేల్’ జయంతి వేడుకలు నిర్వహించారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పద్మా రెసిడెన్సీ అపార్ట్ మెంట్స్ (ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర) వద్ద ‘ ఈ దేవానంద్ యాదవ్ సౌజన్యంతో జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ చిత్రానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మధుసూదన్ (సివిల్ సర్జన్, ఆర్థో, జిల్లా వైద్యశాల, రంగారెడ్డి జిల్లా) విచ్చేసి వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ (నిమ్స్, టిమ్స్, ఎస్డీ ఐ హాస్పిటల్, సీజీహెచ్ఎస్, ఊర్డు యూనివర్సిటీ హెల్స్ సెంటర్, హెచ్సీయూ హెల్స్ సెంటర్, డిస్ర్టిక్ హాస్పిటల్ కొండాపూర్, లింగంపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్, అర్బన్ హెల్స్ సెంటర్ హఫీజ్ పేట్, భేల్ జనరల్ హస్పిటల్, ఈఎస్ఐ ఆర్ సీ పురం, ఏరియా హాస్పిటల్ పటాన్ చెరు) వైద్యశాలలలో పనిచేస్తూ ఉత్తమ సేవలందించిన సేవామూర్తులైన 80 మంది నర్సులకు ‘ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారం తో (జ్ఞాపిక, శాలువా, పుష్పగుచ్ఛం) ఘనంగా సత్కరించి మాట్లాడారు.
రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యమన్నారు. “ఈనాడు సమాజంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నర్సుల కొరత ఉందని, నేటి యువతీ యువకులు నర్సింగ్ కోర్సులలో ఉన్నత విద్యను అభ్యసించాలన్నారు. ఈ సందర్భంగా నర్సులందరి చేత ఆవిడ జీవితాన్ని సేవానిరతిని ఆదర్శంగా తీసుకొని మనసా, వాచా, కర్మణా రోగులకు సేవలందిస్తామ ని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో దేవానంద్ యావద్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విజయలక్ష్మి, వాణీ సాంబశివరావు, జనార్ధన్, పాలం శ్రీను, ధర్మసాగర్, వెంకటేశ్వర్లు, బాలన్న, జిల్ మల్లేష్, ఎం.ఎస్. రావు, సంతోషి, లక్ష్మీ నర్సులు పాల్గొన్నారు.