నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కు మద్దతుగా మాదాపూర్ డివిజన్ లోని నవభారత్ నగర్ లో నిర్వహించిన రోడ్ షోకు అపూర్వ స్పందన లభించింది. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నిర్వహించిన బైక్ రాలీలో కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రజలకు పార్టీ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఇంటింటా పాదయాత్ర చేపట్టి ఓటు అభ్యర్థించారు.

ప్రచారంలో ప్రజాదరణ చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరే రోజులు తొందర్లోనే ఉన్నట్టుగా అర్ధం అవుతుందని ఈ సందర్భంగా తెలిపారు.
