నమస్తే శేరిలింగంపల్లి : బిఆర్ఎస్ హఫీజ్ పేట్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో హఫీజ్ పేట్ 109 డివిజన్ లో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఓల్డ్ హఫీజ్ పేట్ గ్రామంలో గడప గడపకు పాదయాత్ర చేపట్టి ప్రచారం చేశారు. అంతకుముందు కట్ట మైసమ్మ తలి దేవాలయంలో పూజ లు నిర్వహించి అనంతరం సాయిరాం కాలనీ నుండి ప్రచారం ప్రారంభించారు. ఓల్డ్ హఫీజ్ పేట్ వరకూ కొనసాగించారు. బిఆర్ఎస్ పార్టీ కి ఓటు వేసి ఆరెకపూడి గాంధీని అత్యదిక మెజారిటీతో గెలిపించాలని వేడుకున్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/11/4531cba1-efc7-4c80-b5c0-85718f44d87f.jpg)
ప్రచార యాత్రలో ఉద్యమ కారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ హరీష్, లక్ష్మ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శేఖర్ గౌడ్, రామకృష్ణ గౌడ్ ధాత్రి నాథ్ గౌడ్, సాదిక్, సుదీష్, ప్రవీణ్ గౌడ్, భాస్కర గౌడ్, ప్రవీణ్ గౌడ్, బాబు గౌడ్, జమీర్, నాగరాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్ గౌడ్, సాబేర్, వినోద్ కుమార్ , రాజు, గ్యాని, జామీర్, భాగ్యలక్ష్మి , షబానా, జాని, రవి తదితరులకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/11/73f20b2b-e330-4a77-83ea-1e68d4c6a250.jpg)