- బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలతో కలిసి ఇంటింటి ప్రచారంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్
నమస్తే శేరిలింగంపల్లి : బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరెకపూడి గాంధీని ఘన మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాకు, రాఘవేంద్ర కాలనీ సీ బ్లాకు, రాజా రాజేశ్వరి నగర్, ఆనంద్ నగర్ కాలనీలలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలతో కలసి యువజన నాయకులు ఆదిల్ పటేల్ తో కలసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరెకపూడి గాంధీకే ఓటు వేసి బంపర్ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాకి నిర్మల, ఎన్. రూపారెడ్డి, కరీం లాలా, రాఘవేంద్ర కాలనీ బీ బ్లాకు అధ్యక్షులు జూపల్లి శ్రీనివాస్, బాలిరెడ్డి, గోపాల్ కృష్ణ, సైదులు, మహేష్, శారదా, బన్నీ, పూజ, మధు ముదిరాజ్, మురళి ముదిరాజ్, సయ్యద్ ఉస్మాన్, డా రమేష్, మంగమ్మ, గిరి గౌడ్, యాదగిరి, లావణ్య, అబేద్ అలీ, శ్యామల, వెంకట్ రెడ్డి, మొహ్మద్ అలీ, షబ్బీర్, అమినుద్దీన్, ఇమామ్, వహీద్, అహ్మద్, అజమాద్, మీనా భి, పర్వీన్, షాహేన్, సంతోష్, అజ్జు, ప్రభాకర్, మంగలి కృష్ణ, రాజా శేఖర్ పాల్గొన్నారు.
