- ఏర్పాట్లు పూర్తీ చేసిన మాదాపూర్ శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ & కల్చరల్ సొసైటీ
ప్రారంభించనున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ - 4 నుంచి 18 వ తేదీ వరకు సందర్శకులకు అందుబాటులో ఫెయిర్
నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ & కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో “నేషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ ఫెయిర్” ప్రారంభిస్తున్నామని శిల్పారామం జనరల్ మేనేజర్ అంజయ్య తెలిపారు. హైదరాబాద్ క్రాఫ్ట్స్ ప్రేమికుల కోసం, హస్తకళాకారుల ప్రయోజనార్ధం భారత ప్రభుత్వం మినిస్ట్రీ అఫ్ టెక్స్టైల్స్ సంయుక్త నిర్వహణలో ఈ ఫెయిర్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నారని చెప్పారు. దాదాపుగా 550 స్టాల్ల్స్ తో ఈ నెల 4 నుంచి 18 తేదీ వరకు “నేషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ ఫెయిర్” కొనసాగుంతుందని పేర్కొన్నారు. హస్త కళలు, చెక్క బొమ్మలు, విగ్రహాలు, జ్యూట్ బాగ్స్, బొమ్మలు, ఆర్టిఫిషల్ జ్యువలరీ, టెర్రకోట, వెదురు ఫర్నిచర్ మొదలైన రక రకాల ఉత్పత్తులు సందర్శకుల కోసం ఉదయం 10 .30 నుండి సాయంత్రం 8 వరకు అందుబాటులో ఉంటాయని అసిస్టెంట్ డైరెక్టర్ డీసీ హ్యాండీక్రాఫ్ట్స్ అధికారి సయెద్ ముబారక్ అలీ తెలిపారు. రంగు రంగు ల కాంతులతో, ఫౌంటైన్స్, పచ్చిక బయలు నడుమ, ఎడ్లబండి , బోట్ షికారు, ఫుడ్ కోర్ట్స్, పిల్లల ఆటస్థలాలు శిల్పారామం మొత్తం ఎంతో సుందరంగా తీర్చిదిడ్డారు. సందర్శకులు అధిక సంఖ్య లో విచ్చేసి చేనేత హస్తకళకారులను ప్రోత్సహించాలని అధికారులు కోరారు.
