నమస్తే శేరిలింగంపల్లి: హైటెక్ సిటీ, మాదాపూర్ ఆర్య వైశ్య సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్ ను మాదాపూర్ వార్డ్ కార్యాలయంలో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. సమాజం కోసం, సామాజిక సేవలో ఎల్లప్పుడూ ఆర్య వైశ్య సంఘం సభ్యులు ముందుంటారని కొనియాడారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఆర్య వైశ్య కార్యవర్గాన్ని కార్పొరేటర్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైటెక్ సిటీ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు దర్శి శ్రీనివాసులు గుప్త, శేరిలింగంపల్లి మండల ఫౌండర్ ప్రెసిడెంట్ గొల్లి రాజు గుప్త, సెక్రటరీ మాశేట్టి శ్రీనివాస్ గుప్త, కోశాధికారి దొడ్ల సుధాకర్ గుప్త, మాజీ అధ్యక్షులు ఆకారం వెంకటేష్ గుప్త, అశోక్ కుమార్ గుప్త, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండూరి మురళి గుప్త, ఉపాధ్యక్షులు మ్యాడం బాలాజీ గుప్త, చిన్న పరమేష్ గుప్త, ఉప కార్యదర్శి దిడిగం రాజేందర్ గుప్త, కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజేశం, కొత్తూరి వినయ్ పాల్గొన్నారు.