కలిసికట్టుగా పనిచేసి రంజిత్ రెడ్డి గెలుపునకు కృషి చేద్దాం : టీపీసీసీ ఉపాధ్యక్షులు చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి వేం నరేందర్ రెడ్డి

  • నెల రోజులు కష్టపడితే రాబోయే 5 ఏళ్ళు మీకు సేవ చేస్తూ ముందుకు సాగుతా : చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : నారెన్ గార్డెన్ వద్ద శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. శేరిలింగంపల్లి అబ్జర్వర్, తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్, ఎం.బి.సి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బూత్ కమిటీ సభ్యుల పాత్ర కీలకమని, బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు, పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, అభివృద్ధే ఎజెండాగా ముందుకు సాగుతున్న డాక్టర్.జి.రంజిత్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని తెలిపారు.

నారెన్ గార్డెన్ వద్ద శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో  మాట్లాడుతున్న టీపీసీసీ ఉపాధ్యక్షులు చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి వేం నరేందర్ రెడ్డి, పక్కన అభివాదం తెలుపుతున్న ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలకుపై ఎత్తులు వేస్తూ పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ప్రజా పాలనే కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో పాల్గొన్న పార్టీ బృందం

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here