మాదాపూర్ శిల్పారామంలో వేసవి శిక్షణ శిబిరం

  • మే 1 నుంచి 17వ తేదీ వరకూ శిబిరం
  • నామమాత్రపు రుసుముతో శిక్షణ

నమస్తే శేరిలింగంపల్లి : వేసవి సెలవుల నేపథ్యంలో ప్రతి ఏటా మాదాపూర్ లోని శిల్పారామంలో సమ్మర్ ఆర్ట్ క్యాంపు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ సారి మే 1వ తేదీ నుంచి 17 వరకూ నిర్వహించనున్నారు.

ఈ క్యాంపులో మట్టి కుండల తయారీ (పాటరీ), పెన్సిల్ స్కెచ్, మధుబని పెయింటింగ్, ట్రైబల్ పెయింటింగ్ , మండల పెయింటింగ్, లిప్పన్ ఆర్ట్ , సీషెల్ క్రాఫ్ట్, భగవత్ గీత శ్లోకాలు, సంస్కృతంలో మాట్లాడడం వంటి అంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. నామమాత్రపు రుసుముతో వేసవి శిక్షణ శిభిరం ఏర్పాటు చేస్తున్నామని, ఆసక్తి కలిగిన వారు శిల్పారామం కార్యాలయాన్ని సంప్రదించాలని లేదా 8886652030 / 8886652004 కాల్ చేసి వివరాలు పొందవచ్చని శిల్పారామం నిర్వాహకులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here