- శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
- పెద్ద ఎత్తున పాల్గొని మద్దుతు తెలిపిన కార్యకర్తలు, అశేశ జనవాహిని
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు, పార్టీ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డికి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి అశేష జనవాహిని విచ్చేసి విజయవంతం చేశారు. రాహుల్ గాంధీ అధినాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే విధంగా చేవెళ్ల పార్లమెంట్ లో భారీ మెజారిటీ తో రంజిత్ అన్నని గెలిపించుకోవాలని శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అంతకుముందు పాపిరెడ్డి నగర్ హనుమాన్ ఆలయంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పూజ కార్యక్రమంలో పాల్గొని కూకట్పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీ కమాన్ నుండి మొదలైన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
కూకట్పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీ నందు మొదలై, వివేకానంద నగర్ డివిజన్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్, మియపూర్ డివిజన్ మీదుగా చందానగర్ డివిజన్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా నిలిచి చేవెళ్ల లో రంజిత్ అన్న గెలుపుని ఎవరు ఆపలేరని, శేరిలింగంపల్లి నుండి భారీ మెజారిటీ అందించే దిశగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి ఉంటుందని తెలిపారు.
దేశానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఇపుడున్న పరిస్థితుల్లో చాలా అవసరమని, కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే దేశంలోని పేద, అట్టడుగు వర్గాల ఉన్నతి కోసం కృషి జరుగుతుందని తెలిపారు.