బీజేవైఎం నాయకుడిని పరామర్శించిన రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు మహేందర్, శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : మెదక్ లో జరిగిన ముస్లింల నిరంకుశ, అహంకార దాడిని రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు మహేందర్, శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ఖండించారు. గోవధ నిషేధం.. గో సంరక్షణే తమ సంరక్షణ అని ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎక్కడో ఓ చోట రోజు గోవద జరుగుతూనే ఉందన్నారు. బక్రీద్ సందర్భంగా గోవధ జరుగొద్దని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వ్యక్తిపై మెదక్ ముస్లింలు ఎదురుదాడి చేసి కత్తిపోట్లు పొడవగా అక్కడికక్కడే స్పృహ కోల్పోయి  గాయాలపాలయ్యాడు.

మియాపూర్ లోని మియాపూర్ పద్మావతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆ బీజేవైఎం నాయకుడిని స్థానిక కంటెస్టెంట్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్,  పలువురు బిజీఏవై నాయకులు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఎవరైతే ఎదురుదాడికి పాల్పడి, ధర్మం కోసం న్యాయం కోసం పాల్పడుతున్న యువకుడిపై కత్తులతో దాడి చేసి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మెదక్ డీసీపీ, సీఐని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కుమార్ యాదవ్, అమర్ యాదవ్, మహేష్, మాణిక్ రావు, శ్రీధర్ గౌడ్ ఆకుల లక్ష్మణ్ , జితేందర్, గణేష్ ముదిరాజ్, పవన్ యాదవ్ ,కోమల్ , ప్రియాంక పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here