నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ను గెలిపించేందుకు కాలనీవాసులు, ప్రజలు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా నల్లగండ్ల హుడా కాలనీ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

జగదీశ్వర్ గౌడ్ ను గెలిపిద్దామని ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జలంధర్ రెడ్డి, అర్జున్ రావు, శ్రీనివాస్ రెడ్డి, సన్నీ బెనర్జీ, మల్లేష్, విష్ణు, జగదీష్, భరత్, సురేందర్, శేఖర్, శివ, లక్ష్మణ్, మూర్తి, రవి, ప్రభాకర్ పాల్గొన్నారు 30వ తేదీన జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకే ఓటేద్దామని పిలుపునిచ్చారు.