కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం

  • ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ ఆధ్వర్యంలో ఛలో చేవెళ్ల భారీ బహిరంగ సభకు తరలిన శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు

నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని, కాసానిని అఖండ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇద్దామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో చేవెళ్లలో జరిగే భారీ బహిరంగ సభకు కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, నార్నె శ్రీనివాసరావు, జూపల్లి సత్యనారాయణ, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, రోజాదేవి రంగారావు, సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుందని, ఈ సారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇస్తామన్నారు.

ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ ఆధ్వర్యంలో ఛలో చేవెళ్ల భారీ బహిరంగ సభకు తరలిన శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్దాం అని, అందరిని సమన్వయం చేసుకుంటూ ప్రజలలోకి వెళ్లాలని, ప్రతి గడప గడపకి వెళ్లి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అడుగుదామని నాయకులు, కార్యకర్తలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here