నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని గచ్చిబౌలి స్ట్రీట్ నెంబర్ 1 వద్ద ఉన్న నాలాను స్థానిక వాసులతో కలిసి పర్యవేక్షించిన జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .
స్థానిక వాసులు నాలా స్థితిగతుల గురించి కార్పొరేటర్ కి వివరించగా.. ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే సంబంధిత టౌన్ ప్లానింగ్, HMWSSB, జిహెచ్ఎంసి ఈఈ అధికారులతో కలిసి మరొకసారి పర్యవేక్షించి స్థానిక వాసులకు ఇబ్బంది కలగకుండా తగు చర్యలు చేపట్టి నాలాను శాశ్వత పరిష్కారంగా తీర్చిదిద్దుతానని అన్నారు.
ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి విలేజ్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీమ్, అజ్జు, మహాముద్, గడ్డ రాజు, గోపాల్ యాదవ్, సత్తర్, మహేష్, ఖదీర్, యూసుఫ్ పాషా, రవి పాల్గొన్నారు.