హ‌ఫీజ్‌పేట‌లో హైడ్రా క‌మిష‌నర్ రంగ‌నాథ్ ప‌ర్యట‌న

శేరిలింగంపల్లి, జూలై 23 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో జీహెచ్ఎంసీతోపాటు సంబంధిత విభాగాల‌కు చెందిన అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ అన్నారు. హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప‌రిధిలోని సీఆర్ ఫౌండేష‌న్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఆయ‌న లోత‌ట్టు ప్రాంతాల్లో పర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ వ‌ర్షాల నేప‌థ్యంలో అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండి ఎప్ప‌టిక‌ప్పుడు స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. ప్ర‌జల భ‌ద్ర‌తే ప్ర‌ధాన ధ్యేయంగా ప‌నిచేయాల‌న్నారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా ప్ర‌జ‌లు కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here