శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మియాపూర్ సర్కిల్ 48 కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 3 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి ఒక ఫిర్యాదు, ఇంజినీరింగ్ విభాగానికి రెండు ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ, ఆరోగ్యం, పారిశుధ్యం, యూసీడీ, యూబీడీ, విద్యుత్, ఇరిగేషన్, వెటర్నరీ తదితర విభాగాలకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం మూడు ఫిర్యాదులు స్వీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.






