నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని పార్క్ అవెన్యూ కాలనీ వాసులు కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ని ఆయన స్వగృహంలో కలిసి సత్కరించారు. పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కాలనీలో నూతనంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ, పార్క్ అవెన్యూలో డ్రైనేజీ సమస్యలు కాలనీ వాసులు సహకారంతో పరిష్కరించుకోగలిగామని, రోడ్లను కూడా సత్వరమే వేయించే విధంగా చర్యలు తీసుకుంటామని పార్క్ అవెన్యూ కాలనీవాసులకు హామీ ఇచ్చారు.