మియాపూర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మన్ కీ బాత్ వీక్షణ

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్‌లోని విడియా కాలనీ, మయూరి నగర్ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో 139వ మన్ కీ బాత్ కార్యక్రమ వీక్షణతో పాటు పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి రేఖా శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌ఛార్జి రవికుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని విడియా కాలనీలో బీజేపీ నాయకుడు సమ్మెట ప్రసాద్ నివాసంలో పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన సమావేశం నిర్వహించారు. అలాగే మయూరి నగర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీ ఇంపీరియల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగణంలో 139వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించడంతో పాటు పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలు, సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం 139వ ఎపిసోడ్‌కు చేరుకోవడం హర్షణీయమన్నారు. విద్యావంతులైన పట్టభద్రులు తమ ప్రజాస్వామ్య హక్కును గుర్తించి, ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో పట్టభద్రుల ఓటు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి రేఖా శర్మ మాట్లాడుతూ ఓటరు నమోదుపై యువత, విద్యావంతులు చూపుతున్న ఆసక్తి అభినందనీయమన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం రావు మాట్లాడుతూ రాబోయే పట్టభద్రుల నియోజకవర్గ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతి బూత్ స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌ఛార్జి రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. పార్టీ అభివృద్ధి, బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకులు, నాయకురాళ్లు, కార్యకర్తల శ్రమను పార్టీ గుర్తిస్తుందని తెలిపారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ ఎంత ముఖ్యమో, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలతో మమేకమై పనిచేయడం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, రవీందర్ రావు, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, నాగులు గౌడ్, సమ్మెట ప్రసాద్, సీతారామరాజు, గణేష్ ముదిరాజ్, లక్ష్మణ్, కృష్ణ, గోపాల్ రావు, ఆంజనేయులు సాగర్, మహేష్ యాదవ్, పద్మ, కాంచన కృష్ణ, శ్రీనివాస్, రాజేష్ గౌడ్‌తో పాటు జిల్లా, నియోజకవర్గ, డివిజన్ స్థాయి నాయకులు, పదాధికారులు, వివిధ మోర్చాల ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here