చింతల్ పద్మా నగర్‌లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ రాజగోపురానికి శంకుస్థాపన

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పద్మా నగర్ కాలనీలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో సప్తద్వార, సప్తశిఖర యుక్త రాజగోపుర నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై, మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వినోద్ కుమార్, వైస్ చైర్మన్లు సుధాకర్, గురు బ్రహ్మం, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ సారథి, జనరల్ సెక్రటరీ నాగేశ్వర్ రావు, ట్రెజరర్ శివలింగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here